Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ అంటే హరితేజకు ఎంత ఇష్టమో.. బన్నీ కోసం ఏకంగా 15 రోజులు ఏం చేసిందో తెలుసా?

తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన ఫేవరేట్ హీరో అని ఆసక్తికర సంఘటన తెలిపింది.(Allu Arjun)

Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ అంటే హరితేజకు ఎంత ఇష్టమో.. బన్నీ కోసం ఏకంగా 15 రోజులు ఏం చేసిందో తెలుసా?

Allu Arjun

Updated On : October 18, 2025 / 9:28 PM IST

Allu Arjun : టీవీ సీరియల్స్, షోలతో ఫేమ్ తెచ్చుకున్న హరితేజ తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని బాగా వైరల్ అయింది. అనంతరం అఆ సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకొని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది. ప్రస్తుతం సినిమాల్లో నటిగా బిజీగానే ఉంది. తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన ఫేవరేట్ హీరో అని ఆసక్తికర సంఘటన తెలిపింది.(Allu Arjun)

హరితేజ మాట్లాడుతూ.. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. నేను అసలు డైటింగ్ చేయను. ఫుల్ గా తింటాను. డీజే సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినప్పుడు అల్లు అర్జున్ ని కలుస్తాను అని 15 రోజులు కేవలం లిక్విడ్ డైట్ చేసి సన్నబడటానికి ట్రై చేశాను. బాగా కనిపించాలి అల్లు అర్జున్ ని కలుస్తున్నాను అనుకునేదాన్ని. షూటింగ్ ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు. నెక్స్ట్ డే షూట్ లో ఆయన్ని కలవగానే ఆయనే వచ్చి.. నేను మీ బిగ్ బాస్ చూసాను. మీరు అంటే మా ఇంట్లో వాళ్లకు ఇష్టం. మీరు చాలా బాగా ఆడారు. నాకు కూడా మీ నటన ఇష్టం అంటే నేను చాలు సర్ అనుకోని షాక్ అయ్యాను అని తెలిపింది.

Also Read : Hariteja : బిగ్ బాస్ హౌస్ లోకి పాములు వచ్చేవి.. లైఫ్ లో ఇంకోసారి బిగ్ బాస్ కి వెళ్ళను.. చిరాకు వచ్చింది..

గతంలో ఒక్క క్షణం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హరితేజ హోస్ట్ చేసింది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ స్టేజిపై కూడా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. హరితేజ ఆర్టిస్ట్ గా నాకు ఇష్టం. తెలుగమ్మాయి. నువ్వు నీ ఫేవరేట్ హీరో ఎవరు అంటే నా పేరే చెప్పావు. మళ్ళీ వేరే చోట వేరే వాళ్ళ పేరు చెప్తే బాగోదు అని సరదాగా అన్నారు.