Hariteja : బిగ్ బాస్ హౌస్ లోకి పాములు వచ్చేవి.. లైఫ్ లో ఇంకోసారి బిగ్ బాస్ కి వెళ్ళను.. చిరాకు వచ్చింది..
తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. (Hariteja)

Hariteja
Hariteja : టీవీ సీరియల్స్, షోలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న హరితేజ తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని అందర్నీ మెప్పించింది. ఆ షో తర్వాత హరితేజ నటిగా బాగా బిజీ అయింది. మరోసారి గత బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ద్వారా కూడా ఎంట్రీ ఇచ్చి అలరించింది.
తాజాగా హరితేజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also See : Siree Lella : పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలుపెట్టిన హీరోయిన్.. త్వరలో నారా రోహిత్ తో పెళ్లి..
హరితేజ మాట్లాడుతూ.. బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో జరగలేదు. ముంబై లోనావాలాలో జరిగింది. ఫారెస్ట్ లో సెట్ వేశారు. రాత్రి అయితే పులుల శబ్దాలు వచ్చేవి. లోపలికి పాములు వచ్చేవి. కానీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. మా ఆయన కూడా బిగ్ బాస్ కి వెళ్ళమనడంతో బిగ్ బాస్ హౌస్ లో మొదటి సీజన్ లోకే వెళ్ళాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ చూడట్లేదు.
నేను వెళ్లిన ఎనిమిదవ సీజన్ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ చూడకూడదు అని డిసైడ్ అయ్యాను. నేను కూడా రెండు సార్లు వెళ్లి ఇంట్రెస్ట్ పోయింది. చిరాకు కూడా వచ్చింది. మళ్ళీ నన్ను పిలిచినా వెళ్ళను. గత సీజన్ లోనే వెళ్లడం నచ్చలేదు. సీజన్ 8 తర్వాత నాకు బాగా డ్యామేజ్ అయింది. నా మీద చాలా హేట్ చూపించారు. నేను చాలా బాధపడ్డాను. నేను చాలా కాన్ఫిడెంట్ లాస్ అయ్యాను. డిప్రెషన్ కి వెళ్ళాను. అది జస్ట్ షో అని నేను కొన్నాళ్ళకు మూవ్ అయ్యాను అని తెలిపింది. దీంతో బిగ్ బాస్ గత సీజన్ తో హరితేజ బాగా బాధపడింది అని అందుకే ఈ డెసిషన్ తీసుకుందని తెలుస్తుంది.