Mega 158: అప్పుడు రవి తేజ.. ఇప్పుడు మలయాళ స్టార్.. చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో

ఈమధ్య కాలంలో ఒక స్టార్ హీరో మరో హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడం పరిపాటిగా మారింది. (Mega 158)ఇలాంటి రోల్స్ చేయడానికి స్టార్ కూడా ముందుకు వస్తుండటం శుభసూచికం అనే చెప్పాలి.

Mega 158: అప్పుడు రవి తేజ.. ఇప్పుడు మలయాళ స్టార్.. చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో

Mohanlal to play a special role in Chiranjeevi's Mega 158

Updated On : October 19, 2025 / 9:12 AM IST

Mega 158: ఈమధ్య కాలంలో ఒక స్టార్ హీరో మరో హీరో సినిమాలో గెస్ట్ రోల్ చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి రోల్స్ చేయడానికి స్టార్ కూడా ముందుకు వస్తుండటం శుభసూచికం అనే చెప్పాలి. ఆడియన్స్ కి కూడా ఒక కొత్త అనుభూతి కలుగుతుంది. ఆలాగే, ఇండస్ట్రీలో హీరోలంతా కలిసే ఉంటారు.. ఎవరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండవు అనే హింట్ కూడా జనాల్లోకి వెళుతుంది. కేవలం ప్రెజెంట్ జనరేషన్ హీరోలు మాత్రమే(Mega 158) కాదు సీనియర్ హీరోలు కూడా తమ సినిమా మరి హీరోకి ఛాన్స్ లు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాంటి మ్యాజిక్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో రవి తేజ నటించిన విషయం తెలిసిందే.

Kiran Abbavaram: పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను.. నాకు నా సినిమాలున్నాయి.. ఆలా చేయడం నాకు ఇష్టంలేదు..

చేసింది చిన్న పాత్రే అయినా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం చేస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలో కూడా విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఆమధ్యే ఆయన సీన్స్ ని షూట్ చేశారు టీం. ఇప్పుడు మరో సినిమాలో కూడా చిరంజీవి హీరోగా వస్తున్న సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. అవును, విశ్వంభర సినిమా తరువాత చిరంజీవి దర్శకుడు బాబీతో మరో సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.

త్వరలో షూటింగ్ మొదలుకాబోతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించనున్నాడట. ఇటీవలే దర్శకుడు బాబీ మోహన్ లాల్ ను కలిసి తన క్యారెక్టర్ గురించి చెప్పాడట. ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట. ఇక ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన రాశి కన్నా, మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారట. తమన్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.