Kiran Abbavaram: పవన్ కళ్యాణ్ తో సినిమా చేయను.. నాకు నా సినిమాలున్నాయి.. ఆలా చేయడం నాకు ఇష్టంలేదు..
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కె ర్యాంప్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Hero Kiran Abbavaram says he will not do a film with Pawan Kalyan
Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కె ర్యాంప్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 18న వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి యునానిమస్ పాజిటీవ్ టాక్ వచ్చింది. ఆలాగే, దీపావళి సీజన్ లో వచ్చి పండగ విన్నర్ గా నిలిచింది. ఇక కిరణ్ అబ్బవరం కూడా (Kiran Abbavaram)ముందునుంచే చెప్పి మరీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో, ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
Ram Charan-Sukumar: అవేవి కాదు.. రామ్ చరణ్ సినిమానే చేస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత నవీన్
అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి హీరో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కె ర్యాంప్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు కిరణ్ అబ్బవరం. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతూ..”మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కదా. ఆయన సినిమాల్లో నటించే అవకాశం వస్తే చేస్తారా”అని అడిగాడు. దానికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. దానికి సమాధానంగా కిరణ్ మాట్లాడుతూ.. “నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికి చాలాసార్లు చెప్పాను. కానీ, ఆయన సినిమాల్లో ఇప్పుడు నేను చేయలేను. ఎందుకంటే, ఇప్పుడు నేను హీరోగా నా కెరీర్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నాను. కాబట్టి, ఈ టైంలో మళ్ళీ క్యారెక్టర్స్ అంటే చేయలేను.
ఇపుడు నా ఫోకస్ అంతా ఈ సినిమాలు, నా మార్కెట్ మీదే ఉంది. ఒకవేళ అవకాశం వస్తే కూడా.. ఈ క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం అయితేనే చేయగలడు అనేలా ఉంటే చేస్తా. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాలో కనిపించాలని మాత్రం చేయను అంటూ చెప్పుకొచ్చాడు కిరణ్ అబ్బవరం. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న చాలా మంది కిరణ్ అబ్బవరం ఫేర్ బిహేవియర్ ను ఇష్టపడుతున్నారు. చాలా మంది ఇలాంటి విషయంలో కాకా పట్టడానికి ట్రై చేస్తారు. కానీ, కిరణ్ అబ్బవరం మాత్రం అలాంటి చెప్పకుండా జెన్యూన్ ఆన్సర్ ఇచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.