CM Jagan : గండికోటలో ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్.. శంకుస్థాపన చేసిన సీఎం జగన్

గండికోటలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం వల్ల గ్లోబల్ మ్యాప్ లోకి వెళుతుందన్నారు. తిరుపతి, విశాఖలో కూడా ఒబెరాయ్ హోటల్ వస్తోందని తెలిపారు.

Gandikota CM Jagan

Gandikota Oberoi Hotel : గండికోటలో ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ నిర్మిస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. గండికోట అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లోకి వెళ్తుందన్నారు. ఆదివారం సీఎం జగన్ గండికోటలో ఒబెరాయ్ సెవెన్ స్టార్ హోటల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాండ్ క్యానియన్ గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు.

గండికోటలో సెవెన్ స్టార్ హోటల్ నిర్మాణం వల్ల గ్లోబల్ మ్యాప్ లోకి వెళుతుందన్నారు. తిరుపతి, విశాఖలో కూడా ఒబెరాయ్ హోటల్ వస్తోందని తెలిపారు. ఒబెరాయ్ హోటల్ వల్ల కనీసం 500 నుండి 700 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. గండికోటలో మరో గల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు.

Minister Amarnath : పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో సైడ్ హిరో, చంద్రబాబు విలన్ : మంత్రి అమర్నాథ్

స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రానున్నాయని తెలిపారు. పర్యావరణ అనుమతులు వచ్చాక పనులు వెగవంతం అవుతాయని చెప్పారు. కొప్పర్తిలో డిక్సన్ సంస్థ ద్వారా మరో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. కడప జిల్లాకు మరిన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు.

కడప జిల్లాకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని, మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన సాగుతోంది. జమ్మలమడుగు, పులివెందులలో సీఎం పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.