Jagananna Amma Vodi: అమ్మఒడి నిధులు వచ్చేస్తున్నాయ్.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్న సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకానికి సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కడం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

Jagananna Amma Vodi

AP CM Jagan: ఏపీలోని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ కానుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం (amma vodi scheme) కు సంబంధించి నగదును సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM JaganMohan Reddy) బటన్ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా (Parvathipuram Manyam District) కురుపాంలో బుధవారం జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. ఈ సందర్భంగా జగనన్న అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థులు తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. ఇదిలాఉంటే నిన్నటితో KYC పూర్తయిన వారి అకౌంట్లలో డబ్బులు వేయనుండగా.. ఏదైనా సాంకేతిక కారణాలతో జూన్ 28 తర్వాత KYC చేసుకున్నవారికి జులై మొదటి వారంలో జరిగే వారోత్సవాల్లో నగదు జమ అవుతుంది.

CM Jagan : ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్ధేశం.. 15 మందికి స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బహిరంగ సభలో సీఎం జగన్ బటన్ నొక్కి అమ్మఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ. 6,392.94 కోట్లు జమ చేయనున్నారు. బుధవారం అందజేసే నగదుతో కలిపితే ఇప్పటి వరకు జగనన్న అమ్మఒడి ద్వారా రూ. 26,067.28 కోట్లు మేర విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లవుతుంది.

CM Jagan : లీడర్ షిప్ పెంచే విధంగా‌ చదువులుండాలి.. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యనందిస్తున్నాం : సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కీలక సంస్కరణలు చేపట్టిన సీఎం జగన్.. నాలుగేళ్లలో విద్యారంగంపై రూ. 66,722.36 కోట్లను వెచ్చించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.