CM Jagan : ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్ధేశం.. 15 మందికి స్ట్రాంగ్ వార్నింగ్
పనిచేయకపోతే టికెట్ ఇచ్చేది లేదు.ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి తెలుసుకోవాలి. రిపోర్టులు వచ్చాకే టికెట్లు.

CM Jagan Meet MLA's
CM Jagan Meet MLA’s : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతారవణం రోజు రోజుకు హీట్ పెరుగుతోంది. దీంట్లో భాగంగా సీఎం జగన్ ఎమ్మెల్యేలతో బుధవారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. పనిచేయకపోతే టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. ఎవరికి ఏ పథకం అందలేదో తెలుసుకోవాలని దాని కోసం ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లి తెలుసుకోవాలని ఆదేశించారు.
దీంట్లో భాగంగా జూన్ 23 తేది నుండి చేపట్టనున్న జగనన్న సురక్ష కార్యక్రమం కార్యాచరణపై ప్రధానంగా దిశానిర్దేశించారు. సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్ళాలని.. ఏ ఏ పథకాలు ప్రజలకు అందలేదో తెలుసుకోవాలని నేతలకు ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్రమం కోసం ప్రత్యేక యాప్ రూపొందించామని.. ఇందులో 11 అంశాలు ఉంటాయని, ఈ అంశాలల వారీగా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని ఆదేశించారు.
Pawan Kalyan Vs YCP : పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ కాపు లీడర్స్.. ఏపీ రాజకీయాల్లో పెరిగిన హీట్
ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో జగన్ 15 మంది ఎమ్మెల్యే లకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. మీ పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. కానీ మారకపోతే ఫలితం తప్పదని హెచ్చరించారు. ఆ 15 మంది ఎమ్మెల్యేల పనితీరు రిపోర్ట్ వ్యక్తిగతంగా పంపిస్తానని..ఇప్పటికైనా వారి పనితీరు సరిచేసుకోవాలని సూచించారు.
అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేపడతామని.. సెప్టెంబర్ నాటికి సర్వే రిపోర్ట్ లు కూడా వస్తాయని తెలిపారు. ఆ రిపోర్టుల ఆధారంగానే టికెట్లు ఇస్తానని స్పష్టంచేశారు. కొంతమందిని విడిగా పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఎన్నికలకు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉందని, ఈ లోగా ప్రతీ ఒక్కరు కష్టపడి పని చెయ్యాలని అన్నారు. అవసరం అయితే నిద్ర మాని అయినా పనిచేయాలని, 175 సీట్లు సాధించాలని ఆదేశించారు.
JC Prabhakar Reddy: ఎమ్మెల్యే.. నీపని నువ్వు చేసుకో.. ఆ విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్