JC Prabhakar Reddy: ఎమ్మెల్యే.. నీపని నువ్వు చేసుకో.. ఆ విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్

ఎవరు అడ్డొచ్చినా పనులు చేయించి తీరుతా.. చేతనైతే ఆపుకో.. అంటూ స్థానిక ఎమ్మెల్యే‌కు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.

JC Prabhakar Reddy: ఎమ్మెల్యే.. నీపని నువ్వు చేసుకో.. ఆ విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్

JC Prabhakar Reddy

Updated On : June 21, 2023 / 1:48 PM IST

Andhra Pradesh: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది. అన్నీ ఎమ్మెల్యే చెప్పినట్లు జరగాలంటున్నాడు. అభివృద్ధి పనుల విషయంలో జోక్యం చేసుకుంటే ఖబడ్దార్.. అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మెలేశాడు. మురుగునీటి పైప్‌లైన్‌లు బ్లాక్ అయి పదకొండు నెలలైనా పరిస్థితి అలానే ఉంది. మరమ్మతు పనులు చేయాలంటే ఎమ్మెల్యే అనుమతులు తీసుకోవాలా అంటూ ప్రభాకర్ రెడ్డిప్రశ్నించారు.

JC Prabhakar Reddy: వివేకానంద హత్యకేసుపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎవరు అడ్డొచ్చిన పనులు చేయించి తీరుతా. చేతనైతే ఆపుకో అంటూ స్థానిక ఎమ్మెల్యే‌కు ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. పోలీసులకు కూడా చెబుతున్నా.. సోమవారం రోజు మాంసం మార్కెట్‌కూడా తొలగించేయిస్తా. పోలీసులు చట్టాన్ని ఫాలో కావాలి, పనులను అడ్డుకోవద్దు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఇప్పటికే మాంసం మార్కెట్ తొలగించాలని 10 లెటర్లు ఇచ్చానని జేసీ చెప్పారు. ఈ ఊరు నాది, ఇక్కడ 58వేల ఇళ్లలోని ప్రజలు నా పిల్లలతో సమానం. ఏ ఇంట్లోఉన్న ప్రజలకూ కష్టం కలగనివ్వనని అన్నారు.

ఎమ్మెల్యే నీ పని నువ్వు చేసుకో, అభివృద్ధి పనుల విషయంలో తలదూరిస్తే ఎంత దూరం వెళ్లడానికైనా నేను రెడీ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. దెబ్బతిన్న డ్రైనేజీ పైప్‌లైన్ మరమ్మతు పనులు చేయకపోతే ప్రజలే ఇంజనీర్లను కొట్టాల్సిన పరిస్థితి వస్తుందంటూ ప్రభాకర్ రెడ్డి అన్నారు.