చేతులెత్తి దండం పెడుతున్నా..ఇళ్లలోనే ఉండిపోండి – సీఎం జగన్

  • Publish Date - March 26, 2020 / 01:29 PM IST

చేతులెత్తి దండం పెడుతున్నా..ఇళ్లలోనే ఉండిపోండి..ఎవరూ బయటకు రావొద్దని సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కరోనా వ్యాధి ప్రబలుతున్న క్రమంలో ప్రజలు సహకరించాలని, ఏప్రిల్ 14వ తేదీ వరకు ఎక్కడికీ తిరగకుండా ఇళ్లలోనే ఉందామని పిలుపునిచ్చారు.

వైద్యులు, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని, వారికి తన అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి 26వ తేదీ గురువారం సాయంత్రం ఆయన కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దీనిపై ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 

బయట తిరిగితే..కాంటాక్ట్ ట్రేసింగ్ కష్టమౌతుందన్నారు. అప్రమత్తంగా ఉండాలని..ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేస్తుందని తెలిపారు. కొన్ని నిర్ణయాలు సరైన సమయంలోనే తీసుకోవాలన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 1902 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరోసారి ఇంటింటి సర్వే నిర్వహించాలని చెప్పామన్నారు.

విదేశీయుల వివరాలే కాకుండా..ప్రతి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా..జిల్లాలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులు పనులకు వెళితే..సోషల్ డిస్టెన్ పాటించాలని సూచించారు సీఎం జగన్.