AP Covid : వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి..ప్రజలు జాగ్రత్త – సీఎం జగన్

కరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీఎం జగన్.

CM Jagan : కోవిడ్ వ్యాక్సినేషన్ పై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో వైరస్ విస్తరించకుండా..పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారాయన. అయితే..కరోనా వైరస్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

2021, ఏప్రిల్ 29వ తేదీ గురువారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారాయన. వ్యాక్సినేషన్ మాత్రమే పరిష్కారమని, ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలి డోస్ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికే వేశారని, రెండో డోస్ కేవలం 2.6 కోట్ల మందికి వేశారని గుర్తు చేశారు.

ఏపీ రాష్ట్రానికి ఇంకా 39 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు కావాలని, వచ్చే ఏడాది జనవరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని..వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటి వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.
దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లుగా ఉందని, అందులో కోటి కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కాగా..మిగిలినవి కోవీషీల్డ్ అని చెప్పారు. 45 ఏళ్లు దాటిన వారు..26 కోట్ల మంది ఉంటారని లెక్క చెప్పారు.

వారికి 4 వారాల వ్యవధిలో రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుందని, మొత్తం 52 కోట్ల వ్యాక్సిన్ లు కావాల్సి ఉంటుందన్నారు. 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు..దేశంలో 60 కోట్ల మంది ఉన్నారన్నారు. వీరికి 120 కోట్ల వ్యాక్సిన్ లు కావాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జనవరి నాటికి అందరికీ వ్యాక్సిన్ వేయగలుగుతామని, ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి కంటిన్యూగా ఉంటుందని..అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీఎం జగన్.

Read More : కోవాగ్జిన్ టీకా ధర తగ్గించిన భారత్ బయోటెక్

ట్రెండింగ్ వార్తలు