Cm Jagan Floods
CM Jagan : అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయా జిల్లాల కలెక్టర్లతో వరద సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. వరద బాధితులను సహాయ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు. అంతేకాదు శిబిరాల్లో ఉన్న వారికి తక్షణ సాయం కింద వెయ్యి రూపాయలు అందించాలన్నారు. శిబిరాల్లో అన్ని రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు జగన్. అవసరమైన చోట సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలను గమనించుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులతో చెప్పారు జగన్.
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కల్యాణి డ్యామ్ దగ్గర నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. దాంతో ఈ జలాశయం గేట్లు ఎత్తి 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. 2015 తర్వాత కల్యాణి డ్యామ్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరడం ఇదే ప్రథమం.
Kamakshi Plant : కాలేయ వ్యాధుల నుండి కాపాడే కామాక్షి మొక్క
అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలు చిత్తూరుని వణికిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుండపోత వానలతో తిరుపతి విలవిలలాడుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలతో తిరుపతి నగరం తడిసి ముద్దవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.
పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఆధ్యాత్మిక నగరం చిన్నపాటి వర్షాలకే అస్తవ్యస్థంగా మారుతోందని వాపోతున్నారు. తిరుపతి పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షంతో కనుమదారులు మూసేయడంతో తిరుమలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడపలో కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది.
Paytm CEO : నెలకు రూ.10వేల జీతమని.. నాకు పిల్లను ఇవ్వనన్నారు : విజయ్ శేఖర్ శర్మ
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తిరుమాడ వీధులు జలమయం అయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సెల్లార్లలోకి నీరు చేరడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అటు, కనుమదారులు, మెట్ల మార్గంపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. కనుమదారుల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దాంతో కనుమదారులను మూసివేశారు.
ముఖ్యంగా, రెండో కనుమదారి ప్రమాదకరంగా మారింది. పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఈ కనుమ రహదారిపై పలు చెట్లు కూడా కూలిపోయాయి. ఈ నేపథ్యంలో రహదారులపై పడిన రాళ్లు, మట్టి తొలగించి రాకపోకల పునరుద్ధరణకు టీటీడీ ముమ్మరంగా శ్రమిస్తోంది. అటు, భారీ వర్షం కారణంగా టీటీడీ పాపవినాశనం రహదారిని కూడా మూసివేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండ్రోజుల పాటు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.
ఇక, నెల్లూరు జిల్లాలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండడంతో కైవల్యా నది తీవ్రరూపు దాల్చింది. వెంకటగిరిలో రహదారిపైకి నది పొంగి ప్రవహిస్తుండడంతో వాహనాలను నిలిపివేశారు. అటు జిల్లాలోని గూడూరు దగ్గర పంబలేరుకు కూడా వరద పోటెత్తింది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోనూ అధిక వర్షపాతం నమోదైంది.
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. వాయుగుండం పశ్చిమ వాయువ్యదిశగా కదులుతోంది. రేపు ఉదయానికి చెన్నై- పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.