cm jagan ports industrial corridors: పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లపై ఏపీ సీఎం జగన్ రివ్యూ చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెండున్నరేళ్లలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టు నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులతో చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
https://10tv.in/visakha-youth-spoiling-lifes-with-bike-racings-and-drugs/
భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి కావాలన్నారు. ఎయిర్ పోర్టు నుంచి సిటీకి చేరుకునేలా బీచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కావాలని అధికారులతో చెప్పారు సీఎం జగన్. పోలవరం నుంచి పైప్ లైన్ల ద్వారా విశాఖకు నీటి సరఫరా కోసం డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. సంక్రాంతిలో శంకుస్థాపనకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు.