CM Jagan Serious : ఆ 20మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సీరియస్

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో పనితీరు సరిగా లేదంటూ 20మంది ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు సీఎం జగన్. మార్చి 18 నుంచి మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక లబ్దిదారుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించనున్నారు గృహసారథులు.

CM Jagan Serious : వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది. మార్చి 18 నుంచి మా భవిష్యత్ నువ్వే జగన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యాక లబ్దిదారుల ఇళ్లకు స్టిక్కర్లు అతికించనున్నారు గృహసారథులు. ఇక ఈ సమావేశంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో పనితీరు సరిగా లేదంటూ 20మంది ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు సీఎం జగన్.

ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. గతంలో కంటే ఈసారి ఎక్కువ సమయం ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రివ్యూ చేసిన జగన్.. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నారు.

నెల రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి బ్రేక్ పడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమావేశంలో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఈ నెల 16వ తేదీ నుంచి మార్చి 16 వరకు నెల రోజుల పాటు రాష్ట్రంలో అమల్లో ఉంటుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ ఎంతవరకు సాధ్యం అనే దానిపై చర్చించారు.

ఇక ఇదే సమావేశంలో పని తీరు సరిగా లేని ఎమ్మెల్యేల పేర్లు చదివి వినిపించారు సీఎం జగన్. ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, సుచరిత, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, ఉదయభాను, కొడాలి నాని, వసంత కృష్ణ ప్రసాద్ పేర్లను చదివి వినిపించారు సీఎం జగన్. వీరి పని తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.