YS బాటలో జగన్ : ఫిబ్రవరి 01 నుంచి గ్రామాల పర్యటన

  • Publish Date - January 24, 2020 / 11:17 AM IST

అవినీతిని సహించేది లేదు..అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టాలి..రచ్చబండ ద్వారా తన జిల్లాల పర్యటలను ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాను..అని చెప్పిన సీఎం జగన్..అన్న మాట ప్రకారం గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. గతంలో సీఎంగా ఉన్న దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి కూడా రచ్చబండ పేరిట గ్రామాల్లో తిరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం జగన్ కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకోవడంతో తండ్రి..బాటలో జగన్ అంటూ చర్చించుకుంటున్నారు. 

బాధ్యతలు తీసుకున్న అనంతరం ఇచ్చిన మాటలను ఒక్కొక్కటిగా అమలు చేసుకంటూ ముందుకెళుతున్నారు సీఎం జగన్. కొత్త కొత్త పథకాలను ముందుకు తీసుకొస్తూ..ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఎం విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మీటింగ్‌లో ఫిబ్రవరిలో గ్రామాల బాట పడుతానని స్పష్టంగా వెల్లడించారు సీఎం జగన్. 

 

ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలు ప్రజలకు అందుతున్నాయా ? లేదా ? క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడానికి గ్రామాల బాట పట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. 2020, జనవరి 24వ తేదీ శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 01వ తేదీ నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని వెల్లడించారు.

ఇళ్ల పట్టాల విషయంలో లబ్దిదారుల ఎంపిక, పథకాల అమలును స్వయంగా పరిశీలిస్తానని అధికారులకు తెలియచేశారు. ఇందులో పొరబాట్లు జరిగితే..మాత్రం..అధికారులను బాధ్యులుగా చేస్తానని హెచ్చరించారు సీఎం జగన్. 
 

పథకాల అమలు తీరు, సమస్యలు తెలుసుకోవడానికే గ్రామాల్లో పర్యటించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏవైనా సమస్యలు దృష్టికి వస్తే..అక్కడికక్కడనే పరిష్కరించి..అధికారులకు దిశా..నిర్దేశం చేయనున్నారు. 
ఇక సీఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి రచ్చబండ పేరిట గ్రామాల్లో పర్యటించారు. వినూత్న కార్యక్రమానికి ఆనాడు శ్రీకారం చుట్టారాయన. కానీ..చిత్తూరు జిల్లాలో కార్యక్రమానికి వెళుతున్న సందర్భంలో కర్నూలు జిల్లాలోని నల్లమల్ల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోవడంతో ఆయన మృతి చెందారు. 

Read More : సీఎం జగన్ ఉన్మాది : బండ బూతులు తిడుతున్నారు – బాబు