Jagan Vishaka
CM Jagan In Visakhapatnam : ఏపీ సీఎం జగన్ విశాఖ జిల్లాకు రానున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2021. డిసెంబర్ 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విశాఖ బయలుదేరనున్నారు సీఎం జగన్. 5.20 గంటలకు ఎన్‌ఏడీ జంక్షన్‌లో ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్‌డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె, దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరవుతారు.
Read More : Amaravati : నేడు అమరావతి రైతుల సభ..రేపు రాయలసీమ మేధావుల ఫోరం బహిరంగసభ
సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరవుతారు. అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనమవుతారు ముఖ్యమంత్రి. దీంతో సీఎం పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Read More : P Chidambaram : మోదీ భయపడేది ఆ ఒక్క విషయానికే!
ఇప్పటికే జిల్లా కలెక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్‌ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్‌డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్ సెంటర్, వైజాగ్ కన్వెన్షన్, పీఎం పాలెం ప్రాంతాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.