ap cm jagan
CM Jagan in Bapatla : తుఫాన్‌తో అపారమైన నష్టం జరిగిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. కోస్తా తీరప్రాంతంలో విపరీతమైన వర్షం పడిందని తెలిపారు. తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని పేర్కొన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వివక్షకు తావు ఉండదని, పారదర్శకంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఫొటో గ్యాలరీని సీఎం జగన్ వీక్షించారు. పాతనందాయపాలెంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడారు. ముంపుకు గరైన గ్రామ ప్రజలకు రేషన్, 2500 రూపాయల సహాయం అందజేస్తున్నామని వెల్లడించారు. ఇన్ పుట్ సబ్సిడి, ఇన్స్యూరెన్స్ పై అపోహలు వద్దన్నారు. పంట నష్టంపై కలెక్టర్లు అంచనా వేశారని తెలిపారు.
AP Government : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
కొంతమంది కావాలని దుష్పచారాలు చేస్తున్నారని తెలిపారు. తుఫాన్ కారణంగా 60 వేల కుటుంబాలు నష్టపోయాయని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్ లో జరిగిన నష్టానికి తరువాత ఖరీప్ సీజన్ కి ఇన్సూరెన్స్ వస్తుందన్నారు. గత ప్రబుత్వంలో వస్తుందో లేదో తెలిసేది కాదన్నారు. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతుల తరుపున ప్రబుత్వం చెల్లిస్తుందని తెలిపారు. విత్తనాలను 80 శాతం సబ్సిడీతో రైతులకు అందిస్తామని పేర్కొన్నారు.