Dr YSR Tallibidda Express : నేడు తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ప్రారంభం..గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు

గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Cm Jagan (1)

Dr YSR Tallibidda Express : గర్భిణుల కోసం ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకుంటోంది. తల్లీ బిడ్డల కోసం వాహనాలను నడపబోతోంది. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలను రెడీ చేసింది. వీటిని కాసేపట్లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలను ఇందుకోసం సిద్ధం చేశారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో వీటిని ప్రారంభిస్తారు సీఎం జగన్‌.

గర్భిణులు, బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కనీసం 19 నుంచి 40 వాహనాలను పంపనున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వాహనాలను ఎక్కువగా తిప్పనున్నారు. ఏజెన్సీ గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడకుండా తల్లీబిడ్డ వాహనాలు వారికి అందుబాటులో ఉంచనున్నారు.

Jagan Release Schemes Calendar : జూన్‌లో అమ్మఒడి, జూలైలో కాపు నేస్తం.. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల చేసిన సీఎం జగన్‌

అన్ని వాహనాలకూ జీపీఎస్ ట్రాకింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇప్పటికే సిద్ధం చేసిన 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను విజయవాడ బెంజిసర్కిల్‌కు తరలించారు. సీఎం జగన్‌ వీటిని ప్రారంభించాక… ఆయా జిల్లాలకు పంపనున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రభుత్వం ఏడాదికి 24 కోట్ల రూపాయలు చెల్లించనుంది.