ప్రత్యేక హోదా ఇవ్వండి : ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని

  • Publish Date - February 5, 2020 / 01:36 AM IST

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారన్న విషయాన్ని ఈ  సందర్భంగా జగన్ ప్రస్తావించారు. విభజన తరువాత ఏపీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని .. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ప్రజలకు అన్యాయం జరుగుతోందని జగన్ అన్నారు. 

14వ ఆర్థిక సంఘం నివేదికలో హోదాపై ప్రస్తావన లేదని.. అయినా దానికి సాకుగా చూపుతున్నారని జగన్ లేఖలో తెలిపారు. ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదిక హోదా అంశం కేంద్ర  ప్రభుత్వం పరిధిలో ఉందని తేల్చిందని తెలిపిన జగన్.. ఈ విషయంలో మీరే చొరవ తీసుకొని ఏపీ ప్రజలకు న్యాయం చేయాలని జగన్ కోరారు. హోదాతో పాటు ఏపీ అభివృద్ధి కోసం నిధులు కూడా ఇవ్వాలని ఆయన  లేఖలో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం జగన్‌  ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దృష్టికి  తెస్తున్నానని, ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాల నష్టపోయిన ఏపీకి న్యాయం చేయాలని కోరారు.

ఏపీ ప్రజల్లో తీవ్రంగా ఉన్న ఆవేదన, బాధను గతంలో కూడా పలు సార్లు మీ దృష్టికి తీసుకొచ్చానని సీఎం తెలిపారు. ”రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. విభజన తర్వాత అత్యధిక ఆదాయం  ఇచ్చే వనరుల ప్రయోజనాలు తెలంగాణకు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఈ ఆదాయ వనరులను కోల్పోయింది” అని జగన్ తెలిపారు.

* ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ
* ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరిన జగన్
* 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకిచ్చే హోదాలను రద్దు చేస్తున్నట్లు 2016 సెప్టెంబర్ లో కేంద్రం ప్రకటించింది
* ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా 15వ ఆర్థిక సంఘాన్ని కోరాం

* హోదాపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం చెప్పింది
* ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ప్రధాని జోక్యం అవసరం
* కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి సరైన న్యాయం జరగలేదు
* ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
* ఏపీకి చేయూతనందించే విధంగా బడ్జెట్ లేదు

* విభజన తర్వాత ఏపీ ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది
* విభజన జరిపిన తీరు వల్ల తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ లబ్ది పొందింది