Delhi : ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ .. కీలక అంశాలపై చర్చ

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. ఏపీ విభజన హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని జగన్ ప్రధానికి కోరారు. పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోడీతో జగన్ చర్చించారు.

CM Jagan's meeting with Prime Minister Modi

Delhi  : ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్‌ భేటీ ముగిసింది. ఏపీ విభజన హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని జగన్ ప్రధానికి కోరారు. పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై మోదీతో జగన్ చర్చించినట్లుగా తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితుల పరిహారంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలు, ముంపు మండలాల్లో పర్యటించిన జగన్ పరిహారం అంశాన్ని ప్రధానితో చర్చిస్తానని పోలవరం నిర్వాసితులకు హామి ఇచ్చారు. దీంట్లో భాగంగానే సీఎం ప్రధానితో చర్చించారు. ముంపు నిర్వాశితులకు పునరావాస్ ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇదే కాకుండా విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలు, పలు రాజకీయాంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం జగన్‌ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు జగన్‌ ముర్మును మర్యాదపూర్వకంగా కలవనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌.కే. సింగ్‌తో భేటీ కానున్నారు జగన్.