CM Jagan : నేడు పులివెందులలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ నేడు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు.

Jagan

CM Jagan Pulivendula tour : ఏపీ సీఎం జగన్‌ నేడు కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9 గంటల 50 నిమిషాలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటల 55 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి తన మామ, దివంగత ఈసీ గంగిరెడ్డి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు.

అనంతరం 10 గంటల 30 నిమిషాల నుంచి.. 11 గంటల 30 నిమిషాలకు వరకు భాకరాపురంలోని ఆడిటోరియంలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్‌ పాల్గొంటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్నారు.

EBC Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.45వేలు.. అర్హతలు, దరఖాస్తు విధానం..

అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్‌ తన తాడేపల్లికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన ఉండటంతో.. అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.