EBC Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.45వేలు.. అర్హతలు, దరఖాస్తు విధానం..

ఏపీలోని అగ్రవర్ణ మహిళలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.45వేలు వేయనున్నారు. లబ్దిదారులు దరఖాస్తు చేసుకునే విధానం..

EBC Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.45వేలు.. అర్హతలు, దరఖాస్తు విధానం..

Ebc Nestham

EBC Nestham : ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక వర్గాల వారి సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తోంది. లబ్దిదారులకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. తాజాగా అగ్రకుల మహిళలకు కూడా సీఎం జగన్ శుభవార్త చెప్పారు. అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ మహిళల కోసం జగన్ ప్రభుత్వం ఈబీసీ నేస్తం పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కాగా, ‘ఈబీసీ నేస్తం’ పథకంలో లబ్ది పొందేందుకు అర్హులైన అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అగ్రకులాలకు చెందిన 45-60 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళలు అర్హులు.

ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

అగ్రకులాలకు చెందిన పేద మహిళల ప్రయోజనం కలిగించడం, వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచటం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వం తెలిపింది. ఈ స్కీమ్ కోసం 2021-22 బడ్జెట్ కింద ప్రభుత్వం ఏడాదికి రూ.605 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.1810 కోట్లు కేటాయించింది.

అర్హతలు:
* వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం లబ్దిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు అనర్హులు.
* కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే అర్హులు.
* అంతేకాదు లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి.
* వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ. 10వేలు(ఏడాదికి రూ.1.20 లక్షలు), పట్టణాలలో అయితే నెలకు రూ.12వేలు(రూ.1.44 లక్షలకు) పరిమితిని మించకూడదు.
* లబ్ధిదారులకు పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా పల్లపు భూమి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.
* కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ ఉండకూడదు. (ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు).
* కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉండొచ్చు)
* కుటుంబంలో ఎవరూ ఇన్ కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు.
* సెప్టెంబర్ 29వ తేదీ 2021 నాటికి 45 సం.లు కంటే ఎక్కువ.. 60 సం.లు లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఈ నెల 7వ తేదీలోపు సమీప గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
* తహసీల్దార్‌ జారీ చేసిన కులధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

Naga Chaitanya-Samantha: బంధం బ్రేకప్.. సామ్-చై మధ్య ఎక్కడ చెడింది?

ఈ పథకం గురించి ఆదేశం ఇచ్చిన రోజు నుంచి లబ్ధిదారుల వయసును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ navasakam.ap.gov.in ను రూపొందించారు. అర్హుల గుర్తింపు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రక్రియ అంతా దీని ద్వారానే జరుగుతుంది. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేసి అర్హతలున్న వారిని గుర్తిస్తారు. లబ్ధిదారులను గుర్తించి సచివాలయాల్లోని సంక్షేమ సహాయకునికి అందిస్తారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు దరఖాస్తులను పరిశీలించి బీసీ కార్పొరేషన్‌ ఈడీలకు పంపిస్తారు. తుది జాబితాకు కలెక్టర్లు ఆమోదం తెలిపిన తర్వాత బీసీ కార్పొరేషన్‌ ద్వారా నిధులు విడుదలవుతాయి.

మరోవైపు రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు జగనన్న చేదోడు పథకం ద్వారా రూ.10 వేలు చొప్పున సాయాన్ని అందజేసేందుకు ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. దుకాణాలు ఉన్న ఆయా కులాల వారికి ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. అక్టోబర్ 1 2021 నాటికి 21-60 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు. ఈ నెల 7వ తేదీలోగా సమీప గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.