జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Revanth Reddy: ఆ ధైర్యం జగన్, చంద్రబాబు, పవన్‌లో ఎవరికైనా ఉందా? అని రేవంత్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నేతలు జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు. విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్‌ సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… వైసీపీ, టీడీపీ, జనసేనలో ఎవరు గెలిచినా మోదీ పక్కనే చేరాలని విమర్శించారు.

మోదీని నిలదీసే ధైర్యం జగన్, చంద్రబాబు, పవన్ లో ఎవరికైనా ఉందా? అని రేవంత్ రెడ్డి అన్నారు. వెన్నెముకలేని నాయకులు ప్రజల సమస్యలు పరిష్కరించలేరని అన్నారు. ఈ సభను చూస్తుంటే హైదరాబాద్‌లో తాను నిర్వహించిన సభ గుర్తొస్తోందని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ లో వైఎస్సార్ బిడ్డ వైఎస్ షర్మిల సభ పెడితే అద్భుతంగా విజయవంతం అవుతుందని అక్కడే చెప్పానని తెలిపారు.

వైఎస్సార్ వారసులు ఎవరు అనే అనుమానాలు ఉండొచ్చని, వైఎస్సార్ సంకల్ప దీక్షను నిలబెట్టే వారే వారసులు అవుతారని అన్నారు. రాజశేఖర్ రెడ్డికి అసలు వారసురాలు షర్మిల రెడ్డి అని చెప్పారు. షర్మిలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

ప్రశ్నించే వారు లేకపోవడం వల్లనే ఇక్కడ మోదీ తన ప్రతాపం చూపిస్తున్నారని తెలిపారు. తెలుగు నేల నుంచి నీలం సంజీవరావు, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, జైపాల్ రెడ్డి, వైఎస్సార్ లాంటి వారు వచ్చారని, ప్రజల ఆకాంక్షలు తీర్చారని చెప్పారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టుకి మొదటి పునాదిరాయి రాజశేఖర్ వల్లనే పడిందని తెలిపారు.

BSP-BRS Alliance : బీఆర్ఎస్‌తో పొత్తుని అందుకే నిరాకరిస్తున్నాం.. బీఎస్పీ సంచలన ప్రకటన..!

ట్రెండింగ్ వార్తలు