CM Jagan Chandrababu Naidu : ఎట్ హోమ్‌‌లో దూరం దూరంగానే సీఎం జగన్, చంద్రబాబు.. కనీసం ఒకరివైపు ఒకరు చూసుకోనేలేదు

ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. పరస్పరం ఎదరు పడలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోలేదు. ఎట్ హోమ్ కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు. జగన్, చంద్రబాబు దూరం దూరంగానే కూర్చున్నారు.

CM Jagan Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన ఈ తేనీటి విందుకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు.

ఒకే కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ జగన్, చంద్రబాబు దూరం దూరంగానే ఉన్నారు. పరస్పరం ఎదురు పడలేదు. ఒకరినొకరు పలకరించుకోలేదు. కనీసం కన్నెత్తి కూడా చూసుకోలేదు. ఎట్ హోమ్ కార్యక్రమంలో ఎవరికి కేటాయించిన టేబుల్స్ లో వారు కూర్చున్నారు. జగన్, చంద్రబాబు దూరం దూరంగానే కూర్చున్నారు. జగన్ దంపతులు గర్నవర్ దంపతులు కూర్చున్న టేబుల్ దగ్గరే కూర్చున్నారు. చంద్రబాబు కాస్త దూరంగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు.

కాగా, ఎట్ హోమ్ కార్యక్రమంలో చంద్రబాబు, ఎంపీ కేశినేని నాని ఒకే టేబుల్ దగ్గర కూర్చోవడం ఆసక్తిగా మారింది. ఇటీవల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కూడా నిరాకరించారు ఎంపీ కేశినేని నాని. ఈ వ్యవహారం టీడీపీ వర్గాల్లో సంచలనం రేపింది. చంద్రబాబు, కేశినేని నాని మధ్య దూరం పెరిగిందని, కేశినేని నాని టీడీపీ వీడతారని వార్తలు వచ్చాయి. ఇంతలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ సడెన్ గా చంద్రబాబుతో కలిసి ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరవడమే కాదు ఏకంగా చంద్రబాబు పక్కనే కేశినేని నాని కూర్చోవడం గమనార్హం. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా వారి వెంట ఉన్నారు.

 

చంద్రబాబు @ ఎట్ హోమ్..

ఏపీ సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు గవర్నర్ హరిచందన్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరినీ గవర్నర్ స్వయంగా పలకరించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఏపీ గవర్నర్ రాజ్ భవన్ లో తేనేటీ విందు ఏర్పాటు చేశారు. కాగా, రాజకీయంగా బద్ధశత్రువులుగా ఉన్న జగన్, చంద్రబాబు ఎట్ హోమ్ కు హాజరవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అంతేకాదు మూడేళ్ల తర్వాత ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు రావడం విశేషం. జగన్ సీఎం అయ్యాక చంద్రబాబు ఎట్ హోమ్ కార్యక్రమానికి రావడం లేదు. ఎట్ హోమ్ కార్యక్రమంలో జగన్, చంద్రబాబు ఒకరినొకరు పలకరించుకుంటారా? లేదా? అనే అంశం అటు రాజకీయవర్గాల్లో ఇటు ప్రజల్లో తీవ్ర ఆసక్తి రేపింది. చివరికి ఇద్దరూ దూరం దూరంగానే ఉండిపోయారు.

టీడీపీ విపక్షంలోకి వచ్చాక ఎట్ హోమ్ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవడం ఇదే తొలిసారి. తొలిసారిగా చంద్రబాబు స్వయంగా హాజరుకానుండడంతో అందరి దృష్టి రాజ్ భవన్ వైపు మళ్లింది. ఎట్ హోమ్ లో ఏం జరగనుంది? సీఎం జగన్, చంద్రబాబు ఒకరినొకరు పలకరించుకుంటారా? లేదా? అనేది ఆసక్తి రేపింది. ఇక ఇటీవల చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా మాట్లాడిన సమయంలోనూ మీడియా దృష్టి అటువైపే మళ్లింది. చాన్నాళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు చంద్రబాబు రాజ్ భవన్ లో సీఎం జగన్ తో కలిసి ఒకే వేదిక పంచుకోవడంపై సర్వత్రా ఆసక్తి రేపింది.

ట్రెండింగ్ వార్తలు