×
Ad

CM YS Jagan Mohan Reddy : రేపు,ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు.

  • Published On : December 1, 2021 / 08:54 PM IST

YS jagan tour schedul;e

CM YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబరు 2,3 తేదీలలో వరద ప్రభావిత  జిల్లాలైన  వైయస్సార్‌ కడప, చిత్తూరు,  నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 2వ తేదీ వైయస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాలలో పర్యటిస్తారు. బాధిత ప్రజలు, రైతులతో ప్రత్యంగా మాట్లాడి వారి బాధలు వింటారు.
Also Read : Extra Marital Affair : వివాహేతర సంబంధం-పులివెందులలో మహిళ దారుణ హత్య
భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించి…ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడతారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ ముఖ్యమంత్రి పర్యటిస్తారు. రెండో రోజూ చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో పర్యటించి పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంటపొలాలను స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో వరద నష్టం, సహాయ చర్యలపై సమీక్షలు నిర్వహిస్తారు.