Kadapa Flood : నేనున్నా..ధైర్యంగా ఉండండి, కాలినడకన సీఎం జగన్ పర్యటన

వరద ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి..బాధితులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు వేడుకున్నారు.

CM YS Jagan : నేనున్నా..ధైర్యంగా ఉండండి..అంటూ వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి..స్వయంగా వరద బాధితులతో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటానని, వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారిని తప్పకుండా ఆదుకుంటామని హామీనిచ్చారు. 2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం సీఎ జగన్ కడప జిల్లాలో పర్యటించారు. వరద ప్రాంతాల్లో కాలినడకన వెళ్లి..బాధితులను ఆయన పరామర్శించారు. ఉదయం 9.30గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు చేరుకున్న సీఎం జగన్…రాజంపేట చేరుకుని..పుల్లపొత్తూరు గ్రామానికి చేరుకున్నారు.

Read More : India-China : సరిహద్దు ప్రతిష్ఠంభణ..14వ రౌండ్ చర్చలకు భారత్-చైనా సన్నద్ధం

అక్కడ పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులతో మాట్లాడారు. అనంతరం ఎగమందనపల్లి..వెళ్లి వరద ప్రభావానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో కాలినడకన పర్యటించారు. అయితే..సమాయానుభావం వల్ల…షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. అన్నమయ్య ప్రాజెక్టు, అధికారుల సమీక్ష సమావేశం రద్దయ్యింది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం జగన్ కు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. వరదలతో సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఇళ్లు కోల్పోయిన బాధితులు వేడుకున్నారు.

Read More : CPM Kerala : మ‌హిళా స‌భ్యురాలి న‌గ్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సీపీఎం నేతలు

ఈ సందర్భంగా ‘నేనున్నాను.. ధైర్యంగా ఉండండి’ అంటూ జగన్‌ హామీనిచ్చారు. రూ. 90 వేల సాయం సరిపోదని, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు కోరారు. ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాదేనని, అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ఆయన పరిశీలించారు. అనంతరం చిత్తూరు జిల్లాకు పయనమయ్యారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్లి వరద బాధితులతో మాట్లాడతారు. సాయంత్రం 6 గంటలకు వరదనష్టం, సహాయ, పునరావాసచర్యలపై తిరుపతిలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి పద్మావతి అతిధి గృహంలోనే బసచేయనున్నారు సీఎం జగన్‌. శుక్రవారం కూడా పర్యటన కొనసాగనుంది.

ట్రెండింగ్ వార్తలు