Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఉచిత అన్నప్రసాద వితరణ విలిపివేత
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. టీటీడీ ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మార్చి 3వ తేదీన (మంగళవారం) మూసివేయనున్నారు.
Tirumala
- తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్
- మార్చి3న అన్నప్రసాద వితరణ నిలిపివేత
- చంద్రగ్రహణం కారణంగా టీటీడీ నిర్ణయం
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధ్వర్యంలోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మార్చి 3వ తేదీన (మంగళవారం) మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి, తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు పేర్కొంది.
Also Read : Chandrababu: ఈరోజు సంక్షేమ పథకాలు పొంది రేపు మాకు ఓట్లు వేయకపోతే మీరే నష్టపోతారు- సీఎం చంద్రబాబు
మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 7.30గంటల వరకు ఆలయం మూసివేసి ఉంటుంది. ఆలయాన్ని గ్రహణ సమయానికి ఆరుగంటల ముందుగానే మూసివేయడం ఆనవాయితీ. రాత్రి 7.30గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు.
రాత్రి 8.30గంటలకు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఆరోజు టీటీడీ ఆర్జిత సేవలను కూడా రద్దు చేసింది. తిరుమల శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. అదేవిధంగా అన్నప్రసాద వితరణ కేంద్రాలను కూడా మూసివేయనున్నారు.
మార్చి3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా తిరుపతి, తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. తిరుచానూరులోని తోళ్లప్ప గార్డెన్స్ ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని ఉద్యోగుల క్యాంటీన్, శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలోని క్యాంటీన్, అలాగే శ్రీనివాసం మరియు విష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను తాత్కాలికంగా నిలిపివేస్తారు.
తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రులు, వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులతోపాటూ వారి సంరక్షకులకు అందించే అన్నప్రసాదాలను ముందస్తుగా పంపిణీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. చంద్రగ్రహణం రోజున ఆలయంతోపాటు అన్నప్రసాద వితరణ కేంద్రాలను మూసివేయడం జరుగుతుందని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
