YS Jagan: శ్రీ కృష్ణుడి పాత్ర మీది.. అర్జునుడి పాత్ర నాది: పొత్తులపై జగన్ కామెంట్స్

YS Jagan: సిద్ధం సభకు వచ్చిన సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. 

YS Jagan

ఈ ఎన్నికల కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడి పాత్ర ప్రజలదని, అర్జునుడి పాత్ర తనదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. సిద్ధం సభకు వచ్చిన సైన్యానికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు.

పేదవాడి బతుకును కాపాడేందుకు మీరంతా సిద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు నాయుడు, ప్రజలే బలంగా తాము ఎన్నికల్లో పోటీ పడుతున్నామని జగన్ చెప్పారు. ఓటు అనే అస్త్రాన్ని పెత్తందార్లపై ప్రయోగించాలని ప్రజలకు చెప్పారు. మరో ఐదేళ్లు మా ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతుగా వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు అని అన్నారు.

నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు ఇప్పుడు కలుస్తున్నాయని ఎద్దేవా చేశారు. మరోనాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అన్నారు. చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయని చెప్పారు. వారంతా ఏపీ భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

తాను పేదలను గెలిపించాలని చూస్తుంటే, టీడీపీ, బీజేపీ, జనసేన తనను ఓడించాలని చూస్తున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. విశ్వసనీయతకు, వంచనకు పోటీ జరుగుతోందని అన్నారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే సింగిల్ గా వచ్చి పోటీ చేయగలరా? అని అన్నారు.


కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ.. ఒంటరిగా 42 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

ట్రెండింగ్ వార్తలు