Polavaram project : పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఏపీ,తెలంగాణ మంత్రుల మధ్య ఆరోపణలు

 పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతోందని పోలవం ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమండ్ చేశారు. మంత్రి పువ్వాడ ఆరోపణలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ఎత్తుకు భద్రాచలం ముంపుకు సంబంధం లేదని అన్నారు.

polavaram project : తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు మరోసారి చిచ్చు రాజేసింది. భద్రాచలం వరద ముంపు పోలవరం ప్రాజెక్టు ఎత్తువల్లే అని తెలంగాణ ఆరోపిస్తోంది. కానీ భద్రాచలం మునకకు పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి సంబంధం లేదని ఏపీ వాదిస్తోంది. ఈక్రమంలో 2022లో వచ్చిన మరోసారి గోదావరి వరద సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు గురించి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతోందని పోలవం ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమండ్ చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ఎన్నో గ్రామాలు వరద ముంపు బారిన పడుతున్నాయని..భద్రాచలం ముంపుకు పోలవరం ప్రాజెక్టు ఎత్తే కారణమని ఆరోపించారు. పోలవరం డ్యామ్ వల్ల గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా వెళ్తోందని అన్నారు. పోలవరం డ్యామ్ ఎత్తును తగ్గించాలని గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. భద్రాచలం పట్టణానికి వరద నుంచి శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ రూ. 1,000 కోట్ల రూపాయలను ప్రకటించారని తెలిపారు. అలాగే ఏపీలో కలిపిన గ్రామాలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని పువ్వాడ డిమాండ్ చేశారు.

తెలంగాణ మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పోలవం డ్యామ్ వల్ల భద్రాచలం మునిగడిపోతోంది అని ఆరోపించటం సరికాదన్నారు. పోలవరంపై తెలంగాణ రాజకీయాలు చేస్తోందని ఇది సరైంది కాదని సూచించారు. భద్రాచలం మునకు పోలవరం ఎత్తే కారణం అనటానికి ఎటువంటి శాస్త్రీయత లేదని అన్నారు. గతంలో కూడా గోదావరికి భారీ వరదలు వచ్చాయని..కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని..కేంద్రం నిధులు సమకూరుస్తోందని..ఏదైనా కేంద్రం చేతిలోనే ఉందని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

 

ట్రెండింగ్ వార్తలు