Vundavalli Arun Kumar : బీజేపీకి ఎదురుగా నిలబడే శక్తి కాంగ్రెస్ కే ఉంది : మాజీ ఎంపీ అరుణ్ కుమార్

కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడైనా పోలైన ఓట్లలలో ఎక్కువ ఎవరికి వస్తే వారే గెలుస్తున్నారని పేర్కొన్నారు.

Former MP Vundavalli Arun Kumar : కర్ణాటకలో కాంగ్రెస్ విజయం చూసిన తర్వాత చరిత్ర పునారావృతం అవుతుందేమో అనిపిస్తుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 1993లో కాంగ్రెస్ మొదట కర్ణాటకలో విజయం సాధించి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. బీజేపీని అడిగేవారు ఎవరున్నారు? అనే తీరుగా ఉందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీని ఎదురుగా నిలబడే శక్తి కాంగ్రెస్ కే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఎక్కడైనా పోలైన ఓట్లలలో ఎక్కువ ఎవరికి వస్తే వారే గెలుస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఓట్లు చీల్చే విధంగా రాజకీయం చేస్తుందన్నారు.

Rajendranagar Assembly constituency: బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు.. టికెట్ రేసులో ఉన్న నేతలెవరు?

మోదీ నోట్లు రద్దు చేసినప్పుడు డిజిటల్ మనీ వస్తుందనుకున్నామని తెలిపారు. అప్పుడు కరెన్సీ రూ.16 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.19 లక్షల కోట్లు చలామనీలో ఉన్నాయని తెలిపారు. పార్టీలను భయపెట్టడం కోసం తప్ప.. జీఎస్టీ ప్రయోజనం ఏముందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం అవినీతి పరులు కాదని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ పాదయాత్రలో ప్రజల దగ్గరకు వెళ్ళడంతో చాలా మార్పు వచ్చిందన్నారు. రాహుల్ గాందీ కాబోయే లీడర్ అని, ఆయనను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తండ్రికి ఏటువంటి స్పార్క్ ఉందో.. ప్రస్తుతం రాహుల్ గాంధీకి కూడా ఆ స్పార్క్ ఉందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు