Ap Corona
AP Corona cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు.
ఏపీలో 1,956 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,59,942కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 19,25,631 మంది కోలుకున్నారు. మరో 20,999 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,312కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 70,695 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.