AP COVID-19 : ఏపీలో కరోనా 24 గంటల్లో 64 మంది మృతి, 17 వేల 354 కేసులు

ఏపీలో…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది. ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Corona Cases In Ap 64 Deaths In 24 Hours 17 Thousand 354 Case

COVID-19 Cases : ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా..ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 17 వేల 354 మందికి కరోనా సోకింది.

ఒక్కరోజే 64 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 86 వేల 494 శాంపిల్స్ పరీక్షించగా..17 వేల 354 మంది కరోనా బారిన పడగా…దీని కారణంగా నెల్లూరులో 8 మంది, విశాఖలో 8 మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కర్నూలులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 10,98,795 పాజిటివ్ కేసులకు గాను..9 లక్షల 67 వేల 823 మంది డిశ్చార్జ్ కాగా..7 వేల 992 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 1882. చిత్తూరు 2764. ఈస్ట్ గోదావరి 1842. గుంటూరు 2129. వైఎస్ఆర్ కడప 757. కృష్ణా 698. కర్నూలు 967. నెల్లూరు 1133. ప్రకాశం 661. శ్రీకాకుళం 1581. విశాఖపట్టణం 1358. విజయనగరం 740. వెస్ట్ గోదావరి 842. మొత్తం : 17,354.

Read More : Etela Rajender : ఈటలపై భూ దందా ఆరోపణలు..సీఎం కేసీఆర్ సీరియస్