ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పోలీస్ స్టేషన్ లో కరోనా రేపుతోంది. 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇద్దరు ఏఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుల్స్, ఐదుగురు కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డ్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
టెలికామ్ కమ్యూనికేషన్స్ లో మరో ఇద్దరు ఉద్యోగులు కరోనా సోకింది. వీరిలో ముగ్గురిని హోంక్వారంటైన్ కు, ఒకరిని నంద్యాల శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. మిగతా 16 మందికి కర్నూలు కోవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే పోలీస్ స్టేషన్ లో ఇరవై రోజుల క్రితం 15 మంది పోలీసులు కరోనా బారిన పడి కోలుకున్నారు. చికిత్స అనంతరం విధులకు హాజరయ్యారు.
అయితే ఇప్పుడు మళ్లీ 20 మంది పోలీసులకు సోకడంతో బనగానెపల్లె ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ సిబ్బంది పోలీస్ స్టేషన్ ను శానిటైజ్ చేస్తున్నారు. బనగానెపల్లె పోలీస్ స్టేషన్ లో రెండో సారి కరోనా కలకలం రేపుతుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
పోలీస్ స్టేషన్ ను శానిటైజ్ చేసి, విధులకు హాజరయ్యేవారు కచ్చితంగా నిబంధనలు పాటించాలని పోలీస్ అధికారులు చెబుతున్నారు. రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగడంతో ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నాతాధికారులు..అధికారులను ఆదేశించారు.