తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరికి కరోనా అనుమానితులు ఆసుపత్రలో చేరారు.
ఒకరు నెదర్లాండ్స్, మరొకరు కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఐసోలేషన్ వార్డులో వీరిద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగానే ఉందని రుయా వైద్యులు వెల్లడిస్తున్నారు. అనుమానితుల శాంపిల్స్ పరీక్షల కోసం స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవలే తైవాన్‌కు చెందిన ఓ వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు అతనికి చికిత్స అందించారు. ఇతని రక్త నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆయనకు నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో తిరుపతి వాసులు ఊపిరిపీల్చుకున్నారు.
ఏపీలో ఒక్క కరోనా వైరస్ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ వైరస్‌ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే..ప్రయాణీకులపై నిఘా పెట్టడం జరిగిందని, 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
* తెలుగు రాష్ట్రాలను కూడా కరోనా భయపెడుతోంది.
* హైదరాబాద్ లో ఒకే ఒక్క కరోనా రోగి ఉన్నాడు.
* ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది.
* గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కేరళలో పర్యటించనుంది.
* కరోనా సోకిన వారికి ఎలాంటి వైద్యం అందించి.. వ్యాధిని తగ్గించారన్న సమాచారాన్ని అధికారులు తెలుసుకోనున్నారు.
* చైనాలో ప్రారంభమైన మహమ్మారి వైరస్ కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
* చైనాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటివరకు 3వేలకు పైగా పౌరులు మరణించగా.. 80వేల మంది వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
* ప్రాణాంతక వైరస్.. చైనాతో పాటు 90 దేశాలకు విస్తరించింది.
* వైరస్ బారినపడి మరణించిన వారిలో చైనా తర్వాత అత్యధికంగా ఇటలీ ఉంది.
Read More : BS-6 వాహనాల్లో లీటర్ పెట్రోల్ ఉండాల్సిందే..లేకపోతే బండిస్టార్ట్ కాదు