అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. వైద్య సిబ్బందినిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. కరోనా సోకిన వ్యక్తి హాస్పిటల్ రాగా వైద్యం సిబ్బంది పట్టించుకోకపోవటంతో అతను ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ భార్య ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటనతో భార్య శోకంతో మిన్నంటింది.
ధర్మవరానికి చెందిన రాజా అనే వ్యక్తి ఈరోజు తెల్లవారుఝామున 3గంటలకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. ఊపిరి ఆడటంలేదు దయచేసి కాపాడండీ అంటూ వైద్య సిబ్బందిని ప్రాధేయపడ్డాడు. కానీ వారు పట్టించుకోలేదు. ఇటువంటివి రోజు చూస్తునే ఉన్నాం..ఎంతమందికని చేయాలింటూ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఊపిరి ఆడక కొనఊపిరితో గిలగిలా కొట్టుకుంటూ భార్య ఒడిలోనే ప్రాణాలు విడిచాడు. తన కళ్లముందే బతకటానికి పోరాడుతున్న భర్తను చూసి ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా ఉండిపోయిందామె.
కళ్లముందే భర్త తనను వదిలిపోవటంతో ఏమీ చేయలేని అలాచే చేష్టలుడిగి ఉండిపోయింది. అంతలో అక్కడికి వచ్చిన శానిటైజేషన్ సిబ్బంది తమ పని తాము చేసుకుపోయారు. మృతదేహంపై ఉన్న దుప్పటి తీసి పడేసి..ఆ శవం చుట్టూ రసాయనాలు పిచికారి చేసి మా పని అయిపోయింది..ఇటువంటివి సర్వసాధారణం అన్నట్లుగా వెళ్లిపోయారు.