విశాఖలో కరోనా కలకలం : కుటుంబంలో ముగ్గురికి వైరస్!

  • Publish Date - March 5, 2020 / 04:25 AM IST

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన 8 మందిలో కరోనా లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది.

విశాఖపట్టణంలోని రాంనగర్‌లోని ఓ కుటుంబంలో ముగ్గురికి ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. వీరు ఇటీవలే కౌలాలంపూర్‌కు వెళ్లి వచ్చారు. అలాగే గాజువాకలోని ఓ యువతి, ఆమె ఫ్రెండ్‌కు కూడా వైరస్ లక్షణాలున్నాయని నిర్ధారించారు. ప్రస్తుతం విశాఖలోని చెస్ట్ ఆస్పత్రిలో ఐదుగురికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. కాకినాడ, విజయవాడ, ఏలూరు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో అనుమానితులకు చికిత్స అందిస్తున్నారు. ఈ 8మంది అనుమానితుల నమూనాలను పూణెకు అధికారులు పంపించారు. దీనికి సంబంధించిన రిపోర్టు వస్తే గాని..వీరికి కరోనా వైరస్ సోకిందా ? లేదా ? అనేది తెలువనుంది. 

* కరోనా వైరస్‌ను ల్యాబ్‌లో తయారు చేసి ప్రజల్లోకి వదిలారనే ప్రచారంలో నిజం లేదు. కరోనా మాత్రం జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది. 
* యాంటిబయోటిక్స్‌తో కరోనా వైరస్‌ సోకదనే ప్రచారంలో నిజం లేదు. 
 

* న్యూమోనియాకు తీసుకునే ఇంజక్షన్లతో కరోనా దరిచేరదనేది కూడా పూర్తిగా అబద్దం. కరోనా వైరస్‌ పూర్తిగా కొత్తది. దానికి వేరే ఇంజక్షన్ ఉంటుంది. వైరస్‌ విరుగుడికి ల్యాబ్‌లలో ప్రయోగాలు జరుగుతున్నాయి. 
* అసలు న్యూమోనియాకు కరోనా వైరస్‌కు సంబంధమే లేదు. 
 

* చైనా నుంచి వచ్చే ప్యాకేజీలు, లగేజీలతో వైరస్ వస్తుందనే పుకార్లు కూడా ఒట్టివే. చైనా నుంచి మన దగ్గరకు రావాలంటే నాలుగైదు రోజుల సమయం పడుతుంది. అంతకాలం వైరస్ బతికే అవకాశమే లేదు. 
* బయటి దేశాల నుంచి వచ్చిన వాళ్లకి.. వాళ్లను కలిసిన వారికి మాత్రమే ఈ వైరస్‌ అంటుకుంది. 
 

* జాగ్రత్త చర్యలు చేపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త వైరస్‌కి ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసానిస్తున్నాయి. 
* పుకార్లు మాత్రం నమ్మొద్దని విఙ్ఞప్తి చేస్తున్నాయి. 

Read More : కరోనా లేదు..బాగానే ఉన్నా – జాకీ చాన్