ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 62 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 955కి చేరింది. ఇందులో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 145మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు శుక్రవారం(మార్చి 24,2020) వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
తాజాగా నమోదైన 62 కొత్త కేసుల్లో కర్నూలు జిల్లాలో 27, కృష్ణాలో 14, ప్రకాశంలో 3, నెల్లూరులో 1, గుంటూరులో 11, తూర్పుగోదావరిలో 2, అనంతపురం జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. కరోనా కేసుల్లో కర్నూలు(261) టాప్ లో ఉంది. ఆ తర్వాత గుంటూరు(206) ఉంది.