AP Coronavirus : ఏపీ స్కూల్స్ లో కరోనా డేంజర్ బెల్స్..ఎక్కడెన్ని కేసులు

ఏపీ స్కూల్స్‌లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.

AP Schools : ఏపీ స్కూల్స్‌లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 30, శ్రీకాకుళం జిల్లా రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 10, కర్నూలు జిల్లాలోని ఐదు విద్యాసంస్థల్లో 7, తిరుపతి ప్రభుత్వ బాలుర హాస్టల్లో 7 కేసులు బయటపడ్డాయి. రాజమండ్రీలో కొత్తగా 50 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఏయూలో గత రెండురోజుల్లో 83 మందికి కరోనా సోకింది. వీరందరినీ ఏయూ ఇంజినీరింగ్‌ విభాగంలో ఐసొలేషన్‌లో ఉంచారు. కరోనా కారణంగా ఏయూ హాస్టళ్లన్నింటినీ మూసేసి ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వచ్చినా.. చాలామంది విద్యార్థులకు లక్షణాలేవీ ఉండట్లేదు.

ఇటీవల రాజమండ్రిలో ఒకే ప్రైవేటు విద్యాసంస్థలో 163 మందికి కరోనా సోకింది. అక్కడే నిర్వహించిన పరీక్షల్లో మరో 50 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 213కు చేరింది. తొలుత కరోనా సోకిన విద్యార్థులకు ప్రైమరీ కాంటాక్టులుగా ఉన్నవారిని పరీక్షించగా ఈ ఫలితాలు వచ్చాయి. మరికొన్ని ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలంలో ఇద్దరు, పరిగి మండలం సేవామందిరంలో ఒకరు చొప్పున ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.

రాజాం ఇంజినీరింగ్‌ కాలేజిలో అధికారులు వసతిగృహాన్ని పరిశీలించి, కళాశాలలో శానిటైజేషన్‌ చేయాలని యాజమాన్యానికి సూచించారు. విద్యార్థులకు ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయడంతో వివరాలేవీ ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. బాధిత విద్యార్థులందరికీ మరోసారి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
Read More : Telangana : కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ..తెలంగాణ 17వ ప్లేస్!

ట్రెండింగ్ వార్తలు