కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ప్రజలకు అవగాహన కలిపిస్తోంది. సూచనలు, సలహాలు అందచేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే గడపాలని కోరుతోంది. ఎందుకంటే..ఈ వైరస్ అనుమానిత లక్షణాలనున్న వారు 95 శాతం మంది విదేశాల నుంచి వచ్చిన వారే. సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసేందుకు ఆశా కార్యకర్తలను నియమించారు. రోజుకు సగటున 600 మంది విదేశాల నుంచి ఏపీకి వస్తున్నారని అంచనా వేస్తోంది. ప్రధానంగా జర్మనీ, ఇటలీ, ఇరాన్, అమెరికా, చైనా దేశాల నుంచి వచ్చే వారిపై నిఘా పెంచింది.
ఏర్పాట్లు : –
* మాస్కులు, శానిటైజర్లు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు.
* తిరుపతి, విజయవాడలో ల్యాబరేటరీలున్నాయి. కాకినాడలో మరో ల్యాబరేటరీ అందుబాటులోకి వచ్చింది. వారం రోజుల్లో అనంతలో మరో ల్యాబలేటరీ ఏర్పాటుకు సన్నాహాలు.
* ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న వెంటిలేటర్లతో పాటు కొత్తగా 100 వెంటిలేటర్లకు ఆర్డర్.
* వైరస్ లక్షణాలున్న వ్యక్తిని ఒకే గదిలో ఉంచేలా ఏర్పాట్లు.
* క్వారంటైన్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు. ప్రచార సాధానాల ద్వారా ప్రచారం.
* ప్రజలు అత్యవసరం అనుకుంటే…తప్ప ప్రయాణాలు చేయకూడదు.
Read More : కరోనా పంజా : చార్మినార్, గోల్కొండ క్లోజ్