Covid Cases : తెలుగు రాష్ట్రాలపై కరోనా పడగ.. తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో 100కుపైగా పాజిటివ్ కేసులు
తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 72 మంది విద్యార్థులు, 30మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు.
- bheemraj
- Published on- January 23, 2022 / 12:17 PM IST
Covid Cases
covid cases in ap and Telangana : తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌ను, విద్యార్థులను టెన్షన్ పెడుతోంది. దీంతో పలు విద్యాసంస్థల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అటు ఆస్పత్రి సిబ్బంది సైతం కోవిడ్ బారిన పడుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఏర్పేడు సమీపంలోని ఐఐటీ శాశ్వత ప్రాంగణంలో 100మందికిపైగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఐఐటీ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 72 మంది విద్యార్థులు, 30మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఐఐటీ వసతి గృహాన్నే కొవిడ్ ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు అధికారులు. ఈ నెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లడంతో ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే క్యాంపస్‌లో ఉంటున్నారు.
CPI(M) Conference : నేటి నుంచి సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర మహాసభలు
దీంతో వీరిలో కొంతమందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. క్యాంపస్‌లో కరోనా సోకడంతో అధికారులు చర్యలు చేపట్టారు. క్యాంపస్ మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీలోనూ కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. వారం రోజుల్లో 16 మంది టీచింగ్ స్టాప్‌కు వైరస్ సోకింది. మరో 45 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఇక హైదరాబాద్ ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిని కరోనా వైరస్ కలవర పెడుతోంది. ఛెస్ట్ ఆస్పత్రిలో వైరస్ విజృంభిస్తోంది. ఆస్పత్రిలో మొత్తం 33 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్ సోకిన వారిలో 17 మంది పీజీ వైద్యులు, ఆరుగురు సీనియర్ రెసిడెంట్ వైద్యులు, 8 మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్‌టీ వైద్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణాన్ని సిబ్బంది శానిటైజ్ చేశారు
