ఏపీ కరోనా కేసుల్లో నిలకడ, పెరుగుతున్న డిశ్చార్జీలు

  • Publish Date - September 25, 2020 / 07:08 PM IST

Andhra Pradesh Corona Cases Update: ఏపీలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. నిజానికి నమోదవుతున్న కేసుల్లో నిలకడ వచ్చింది. కొత్త పాజిటీవ్ కేసులకన్నా డిశ్చార్జ్ అవుతున్నవాళ్ల సంఖ్య ఎక్కువ.

గడిచిన 24 గంటల్లో 69,429 శాంపిల్స్‌ను పరీక్షిస్తే, 7,073 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది.

ఒక్కరోజులో 8,695 మంది కోలుకున్నారు. ఈ సంఖ్యలో నిలకడా ఉంది.

48 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,606కి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా 54,47,796 శాంపిల్స్‌ను పరీక్షించారు.