×
Ad

AP Covid Cases Updates : ఏపీ కోలుకుంటోంది.. పాజిటీవ్ కేసుల కంటే డిశ్చార్జ్ అయ్యేవారే ఎక్కువ

  • Published On : September 15, 2020 / 07:42 PM IST

AP Covid Positive Cases Live Updates : కరోనా కేసుల నుంచి ఏపీ కోలుకుంటోంది. కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోజువారీగా పెరిగే కరోనా కేసుల కన్నా డిశ్చార్జి అయ్యేవారే ఎక్కువ మంది ఉంటున్నారు.. మొన్నటివరకూ పదివేలకు పైగా నమోదైన కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తోంది.



ఏపీలో గత 24 గంటల్లో 70,511 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 8,846 మంది కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 69 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 5వేలు దాటింది.



రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,81,030కి చేరగా, ఇప్పటివరకూ 5,041 మంది మృతి చెందారు. ఏపీలో 47,31,866 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఏపీలో జిల్లాల వారీగా కరోనాతో మృతిచెందిన వారిలో ప్రకాశంలో 10 మంది, చిత్తూరులో 9 మంది, అనంతపూర్ లో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, కృష్ణలో ఆరుగురు, కడపలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు మరణించారు.



ఇక గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కర్నూల్‌లో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు మరణించారు. గడిచిన 24 గంటల్లో 9,628 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు..