Covid Third Wave : ఏపీలో కరోనా థర్డ్ వేవ్ ?.. సర్కార్ అలర్ట్

కరోనా థర్డ్‌ వేవ్‌పై ఏపీ సర్కార్‌ అలర్ట్‌ అయింది. మూడో దశలో విరుచుకుపడనున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాలో అప్రమత్తమైన సర్కార్‌.. పిడియాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది.

Covid Third Wave

Andhra Pradesh : కరోనా థర్డ్‌ వేవ్‌పై ఏపీ సర్కార్‌ అలర్ట్‌ అయింది. మూడో దశలో విరుచుకుపడనున్న మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మూడో దశలో చిన్న పిల్లలకు కరోనా సోకుతుందనే అంచనాలో అప్రమత్తమైన సర్కార్‌.. పిడియాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఏపీ ఎంఎస్‌ఐడీసీ చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలో.. 8 మంది సభ్యులతో పిడియాట్రిక్‌ కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది.

మూడో దశలో చిన్న పిల్లలకు కోవిడ్‌ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ ఏ విధంగా ఉండాలనే అంశాలపై టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధ్యయనం చేయనుంది. చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన కరోనా చికిత్సపై వైద్యారోగ్య శాఖ సిబ్బందికి శిక్షణపై ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ఇవ్వనుంది. వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని.. టాస్క్‌ఫోర్స్‌ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

భారతదేశంలో కరోనా ఉధృతి ఇంకా విజృంభిస్తోంది. మొదటి వేవ్ దాటి సెకండ్ వేవ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతున్నా..ఆందోళన మాత్రం నెలకొంది. సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే…థర్డ్ వేవ్ హెచ్చరికలు జారీ అవుతున్నాయి. థర్డ్ వేవ్ ఎక్కువగా చిన్నారులనే టార్గెట్ చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Read More : Tollywood Actress : కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్న హీరోయిన్స్..