Tollywood Actress : కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్న హీరోయిన్స్..

కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్నారు స్టార్ హీరోయిన్లు.. ఎవరికి వారు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు..

Tollywood Actress : కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్న హీరోయిన్స్..

Tollywood Actress

Tollywood Actress: కోవిడ్‌పై పోరాటానికి మేము సైతం అంటున్నారు స్టార్ హీరోయిన్లు.. ఎవరికి వారు తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. కొంత మంది కోవిడ్ ఒత్తిడి ఎలా తట్టుకోవాలో.. సోషల్ మీడియాలో చెబుతుంటే.. మరికొంత మంది ఏకంగా ఫండ్ రైజింగ్ చేస్తూ.. కరోనా కష్టకాలంలో సహాయం చేస్తున్నారు…

సినిమాల‌తో ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే కాదు. సమాజం పట్ల బాధ్యతగా ఉంటామంటున్నారు హీరోయిన్లు. కొవిడ్ వార్‌లో తమకు తోచిన సాయం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ యోగాతో ఎలా ప్ర‌శాంతంగా ఉండాలో చెప్తానంటోంది. యోగా టిప్స్‌ను షేర్ చేస్తుంటుంది ర‌కుల్‌. కోవిడ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో చాలా మంది ఒత్తిడి, యాంగ్జైటీకి లోన‌వుతున్నారు. కోవిడ్ ఒత్తిడి వ‌ల్ల చాలా మంది భ‌యంతో నిద్ర‌లేని రాత్రుల‌ను గ‌డుపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒత్తిడి నుంచి విముక్తి పొందేలా యోగ నిద్ర యోగాస‌నాన్ని అంద‌రికి ప‌రిచ‌యం చేసింది. ఒత్తిడి, యాంగ్జైటీకి దూరమై రిలాక్స్ అవ్వొచ్చ‌ని చెప్పింది. అంతే కాదు అంతకు ముందు కూడా ఫండ్ రైజింగ్ కార్యక్రమంతో తన వంతు సాయం చేసింది రకుల్..

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కోవిడ్ పరిస్థితుల్లో సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. కోవిడ్ జాగ్రత్తలు చెబుతూనే… డిస్ట్రిబ్యూట్ లవ్ పేరుతో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి.. ఫండ్స్ కలెక్ట్ చేస్తూ.. కరోనా రోగులకు బాసటగా నిలుస్తుంది నిధి. అంతే కాదు ఫిజికల్ డిస్టెంన్స్ పాటిస్తూ.. మాస్స్ మస్ట్‌గా పెట్టుకుంటూ.. అందరూ జాగ్రత్తగా ఉండాలంటోంది.. మరో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా గతంలో కరోనా నుంచి కోలుకున్నాక.. తాను ఆ పరిస్థితుల్లో ఏం చేసిందో వివరించింది. తన అభిమానులకు సూచనలు చేసింది..

మరో వైపు ఈ మధ్య కరోనా నుంచి కోలుకున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అంతే కాదు అందరూ ఆక్సీమీటర్ వాడాలని.. అది ఎలా వాడాలో కూడా ఓ వీడియో చేసి చూపించింది. భయపడకుండా ధైర్యంగా ఉంటే.. కరోనా ఏం చేయలేదంటోంది పూజా. ఇక మెగాస్టార్… ఎన్టీఆర్.. చరణ్.. విజయ్ దేవరకొండ.. ఇలా ఇండస్ట్రీ సెలబ్రిటీలంతా.. అభిమానులకు జాగ్రత్తలు చెబుతున్నారు.. స్టే హోమ్.. స్టే సేఫ్ అంటూ పోస్టులు పెడుతున్నారు..