దళితులను అన్ని విధాలా జగన్ మోసం చేశారు: సీపీఐ రామకృష్ణ

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు.

CPI Ramakrishna visited Ambedkar in Vijayawada and criticise CM Jagan

CPI Ramakrishna: ప్రజాధనంతో సీఎం జగన్ సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అంబేడ్కర్‌ స్మృతి వనం ప్రారంభోత్సవాన్ని సొంత కార్యక్రమంలా నిర్వహించారని దుయ్యబట్టారు. విజయవాడలోని అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు లోపలకు అనుమతించకపోవడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పదవుల కోసం అంబేద్కర్‌ని అవమానిస్తారా?
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంబేడ్కర్ స్మృతి వనం నిర్మాణం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్‌ విగ్రహావిష్కరణను జగన్ తన పార్టీ కార్యక్రమంగా మార్చారు. రాష్ట్రపతి, గవర్నర్, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఎందుకు ఆహ్వానించలేదు? పార్టీ జెండాలతో సభ నిర్వహించడం దుర్మార్గం. అభినవ అంబేడ్కర్‌ అని జగన్‌ని పొగడటానికి సిగ్గుండాలి. వేల కోట్లు దోచుకుని జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్. మీకు సీట్లు, పదవుల కోసం అంబేడ్కర్‌ని అవమానిస్తారా? జాతీయ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని జగన్ సొంత కార్యక్రమంగా చేశారు. దళితులను అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్. జగన్‌ను అభినవ అంబేడ్కర్‌ అంటే.. మహామనీషి అంబేడ్కర్‌ను అవమానించడమే. పార్టీ కార్యక్రమాలకు అంబేడ్కర్‌ స్మృతి వనం వినియోగమా? ఈరోజు సందర్శకులకు అనుమతి ఇవ్వకుండా ఆపడం కరెక్ట్ కాదని అన్నారు.

Also Read: దళితులకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు, రాజధానిలో కోట కట్టుకున్నారు- చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్

విజయవాడ స్వరాజ్ మైదానంలో నెలకొల్పిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పాన్ని శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో 18.81 ఎకరాల విస్తీర్ణంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంబేడ్కర్‌ స్మృతి వనాన్నితీర్చిదిద్దింది.

Also Read: పార్టీ మారిన తర్వాత ఇలా మాట్లాడడం సరైందేనా కేశినేని నాని?: గద్దె రామ్మోహన్ రావు