ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి సీపీఐ పోటీచేసే నియోజకవర్గాలు ఇవే..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీతో కుదురిన ఒప్పందం ప్రకారం సీపీఐ ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది.

CPI state secretary Ramakrishna

AP Congress Party and CPI : ఏపీలో ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఒకపక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి, మరోపక్క ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలసైతం కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. సీట్ల కేటాయింపులో భాగంగా సీపీఐ పోటీ చేసే స్థానాలపై స్పష్టత వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో కుదురిన ఒప్పందం ప్రకారం సీపీఐ ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. తాజాగా, ఆ నియోజకవర్గాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ శనివారం అభ్యర్థులను ప్రకటించారు.

Also Read : తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర సభ.. పాంచ్ న్యాయ్ పచ్చీస్ గ్యారంటీ పేరుతో హామీలివ్వనున్న కాంగ్రెస్

సీపీఐ అభ్యర్థులు వీరే..
గుంటూరు (పార్లమెంట్ స్థానం) : జంగాల అజయ్ కుమార్
అసెంబ్లీ నియోజకవర్గాలు
విశాఖ పశ్చిమ – అత్తిలి విమల
ఏలూరు – బండి వెంకటేశ్వరరావు
విజయవాడ పశ్చిమ – జి. కోటేశ్వరరావు
అనంతపురం అర్బన్ – సీ. జాఫర్
పత్తికొండ – పి. రామచంద్రయ్య
తిరుపతి – పి. మురళి
రాజంపేట – భూక్య విశ్వనాథ నాయక్
కమలాపురం – గాలి చంద్ర