సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

CS Neerabh Kumar Prasad : ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆరు నెలల పాటు అంటే.. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించింది.

Also Read : స్మగ్లింగ్ కేసులో తెలంగాణ మంత్రి కొడుకు నివాసంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సీఎస్ గా కొనసాగుతున్న జవహర్ రెడ్డిని బదిలీ చేసి నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరభ్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి మరో పది రోజులు మాత్రమే పదవీకాలం మిగిలి ఉంది. అంటే.. ఈనెల 30న ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో నీరభ్ సర్వీసును పొడిగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆరు నెలలు నీరభ్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

ట్రెండింగ్ వార్తలు