Asani Cyclone: అసాని తుపాను తీరం దాటి.. తీవ్ర వాయుగుండంగా

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొన్నారు.

Asani Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొన్నారు. దిశను మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతున్నట్లు స్పష్టమైంది.

ప్రస్తుతం మచిలీపట్నానికి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అర్థరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈశాన్య దిశగా కదులుతూ నరసాపురం – పాలకొల్లు – అమలాపురం – కాకినాడ – యానం మీదుగా మళ్లీ సముద్రంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. క్రమేమీ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వెల్లడైంది.

Read Also: : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

వాయుగుండం కదులుతున్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది.

కోస్తా తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మచిలీపట్నం – విశాఖపట్నం – నిజాంపట్నం – కాకినాడ – గంగవరం పోర్టుల్లో చేసిన 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రెండింగ్ వార్తలు