CM Jagan : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వెల్లడించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.

CM Jagan : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష

Cm Jagan (5)

Updated On : May 11, 2022 / 4:02 PM IST

CM Jagan review  : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో హై అలర్ట్ గా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులు ఇచ్చామని తెలిపారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరం అన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని పేర్కొన్నారు.

అయినా ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదన్నారు. ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వెల్లడించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయ శిబిరాలను తరలించిన వ్యక్తికి రూ.వెయ్యి, కుటుంబానికి రూ.2 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు.

Asani Cyclone : బలహీనపడిన అసాని తుపాను

మరోవైపు బంగాళాఖాతంలో అసాని తుపాను బలహీనపడింది. తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడింది. రేపు ఉదయానికి తుపాను వాయుగుండంగా బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలింది. ప్రస్తుతం మచిలీపట్నంకు 40 కి.మీ., కాకినాడకు 140 కి.మీ., విశాఖపట్నంకు 280 కి.మీ.

దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. కొన్ని గంటల్లో వాయువ్య దిశగా పయనించి కొనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

PawanKalyan: తుపాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

రేపు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 60-80 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.