Cyclone Ditva
Cyclone Ditva: నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడింది. దీనికి యెమన్ “దిట్వా”గా నామకరణం చేసింది. దీని ప్రభావంతో దక్షిణకోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
నైరుతి బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి “దిట్వా”గా మారిందని తెలిపారు. చైన్నైకు 700 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని చెప్పారు. (Cyclone Ditva)
Also Read: ఎక్స్‌పెరిమెంట్ అంట.. ప్రతిరోజు 10,000 కేలరీల జంక్ ఫుడ్‌ను తినేసిన ఇన్‌ఫ్లుయెన్సర్.. చివరకు..
ఈ తుపాను ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని.. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరే ఛాన్స్ ఉందని తెలిపారు. ఓడరేవుల్లో 2వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
వచ్చే ఆదివారం కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. అలాగే, ఆయా జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆ జిల్లాల్లో దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.