Cyclone Gulab ఆ జిల్లాల్లో భారీ వర్షాలు

గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసి

Cyclone Gulab : గులాబ్ తుఫాన్ ముంచుకొస్తోంది. ఇవాళ అర్థరాత్రి పలాస- టెక్కలి నియోజకవర్గాల మధ్య గులాబ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపింది. ప్రజలు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచనలు చేసింది. దేవునళ్తాడ, భావనపాడు, మూలపేట మధ్య తుఫాన్ తీరం దాటే చాన్స్ ఉంది. ఆ సమయంలో 70 నుంచి 80 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం పునరావాస కేంద్రాలు, నిత్యావసర సరుకులను సిద్ధం చేసింది. రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది అంతా సిద్ధంగా ఉన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి అప్పలరాజు చెప్పారు.

Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఒడిశా, విదర్భలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే చాన్సుంది.

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు రెడ్ అలర్ట్, ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. నిన్న ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది.

Google Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్‌లోనూ డేటా లీక్!!

గులాబ్ తుఫాన్ టెక్కలి, పలాస నియోజకవర్గాల మద్య తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం వుందని.. తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించారు. జిల్లాలో 8 ఎన్డీఆర్ఎఫ్, 8 ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు.

మూడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్..
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వార్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది.

గులాబ్‌ తుపాను దృష్ట్యా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వెల్లడించింది..

రద్దు చేసిన రైళ్ల వివరాలు..
26-09-2021 – భువనేశ్వర్ – తిరుపతి
27-09-2021 – తిరుపతి – భువనేశ్వర్
26-09-2021 – పూరి – చెన్నై సెంట్రల్
27-09-2021 – చెన్నై సెంట్రల్ – పూరి
26-09-2021 – హెచ్ఎస్ నాందేడ్ – సంబల్ పూర్
26-09-2021 – రాయగడ – గుంటూరు

ట్రెండింగ్ వార్తలు